News December 1, 2025

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపట్ల వివక్షత చూపరాదు: అల్లూరి కలెక్టర్

image

ఎయిడ్స్ వ్యాధి గ్రామస్థుల పట్ల తోటి వారు వివక్షత చూపరాదని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరంలో ఎయిడ్స్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్లో మనోదైర్యం కల్పించాలని సూచించారు. వారికి అండగా నిలవాలన్నారు. వ్యాధిగ్రస్తులను కలసి భోజనం చేసినా, మాట్లాడినా వ్యాధి సంక్రమించదన్నారు.

Similar News

News February 17, 2026

‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

image

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.

News February 17, 2026

అనంత: ఫోన్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డి.హిరేహాల్ మండలం కళ్యం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2 రోజుల క్రితం నవీన్ తన మొబైల్ రీఛార్జ్ కోసం తండ్రిని డబ్బులు అడగగా ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 17, 2026

మిర్యాలగూడ: GOVT జాబ్ వదిలినా దక్కని ఛైర్‌పర్సన్ పదవి..!

image

కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి సతీమణి కవిత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో 17వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే దగ్గర అనుచరులుగా పేరు ఉంది. కాగా ఉద్యోగం వదిలేయడంతో ఛైర్‌పర్సన్ పదవి తనకే అనుకున్నారు. కానీ తనకు రాకపోవడంతో బాధతో వెనుదిరిగారు.