News April 24, 2025
ఎర్రగడ్డకి రోజుకు 20 మంది వస్తున్నారు..!

మత్తుకు బానిసై ఒక్కసారిగా మానాలంటే కష్టమే. మద్యం, సిగరెట్, గంజాయి లాంటి వాటికి బానిసైన వారికి కొద్దిరోజులు దొరకకుంటే ఇతరులపై దాడి చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, సూసైడ్ చేసుకోవడం వంటివి జరుగుతాయని ఎర్రగడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిత తెలిపారు. సూపరింటెండెంట్ వితౌ డ్రావెట్ సిండ్రోమ్ అంటారని, అలాంటి వారు నిత్యం ఆస్పత్రికి 20 మంది వస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 14, 2026
1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం: శ్రీకాకుళం కలెక్టర్

జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షలు 1,13,102 మంది మార్చి 15వ తేదీన రాయనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యాసకులకు అన్ని మండల, మున్సిపాలిటీ, గ్రామ వార్డుల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో 1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News March 14, 2026
అనంతగిరిలో పుట్టింది.. HYDలో ఆగమైంది!

మనుషుల దాహాన్ని తీర్చి, పొలాలకు నీరందించే నదులు నేడు కన్నీరు పెడుతున్నాయి. మానవ అవసరాల కొరకు నదిలోని ఇసుక తవ్వేస్తున్నాడు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రసాయనాలను విడుదల చేసి నదులను కలుషితం చేస్తున్నాడు. నదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు, మన సంస్కృతికి చిహ్నాలు. మన జిల్లాలోనే పుట్టి సర్వ నాశనం అయిన మూసీ ఇందుకు ఉదాహరణ. ఇకనైనా మేల్కొందాం.. రాజకీయాలకు అతీతంగా మన మూసీని కాపాడుకుందాం.
News March 14, 2026
కోనసీమ: గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక ఆదేశాలు

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతా రంగాలకు మాత్రమే LPG నిరంతరాయంగా సరఫరా చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో శనివారం జిల్లాలోని 25 గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలన్నారు. డీలర్లు వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో కీలక భూమిక పోషించాలని, ప్రభుత్వానికి సహకరించాలన్నారు.


