News August 14, 2025
ఎర్రగుంట్ల: బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్.. ఇద్దరు మృతి

ఎర్రగుంట్లలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. థర్మల్ నుంచి కలమల్లకు వెళ్తున్న టిప్పర్ బైక్‌ను ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముద్దనూరు మండలం కొసినేపల్లికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ప్రొద్దుటూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 13, 2026
2,06,052 మంది రైతులకు లబ్ధి: కలెక్టర్

నంద్యాల మండలం బిల్లలాపురంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో విడత ద్వారా 2,06,052 మంది రైతులకు రూ.119.91 కోట్లు, పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకూ రూ.400.2 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 13, 2026
మార్చి15న విశాఖకు మాజీ ఉపరాష్ట్రపతి

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు మార్చి 15న విశాఖ రానున్నారు.15న రాత్రి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్‌లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. 19న ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు.
News March 13, 2026
కావలి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. తలమంచి- అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ మధ్య గుర్తుతెలియని సుమారు 27ఏళ్ల వ్యక్తి బెంగళూరు- గువాహటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నలుపు రంగు టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు తెలపాలని కోరారు.


