News July 13, 2024
ఎర్రవెల్లిలో హిమాన్షు బర్త్‌డే వేడుకల్లో కేసీఆర్

కేటీఆర్ కొడుకు హిమాన్షును బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో హిమాన్షు తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వదించారు. హిమాన్షు 19వ ఏట అడుగు పెట్టడంతో..19 కిలోల కేక్‌ను కుటుంబ సభ్యులు కట్ చేయించారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుకల్లో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 13, 2025
మెదక్: లేగ దూడపై చిరుత దాడి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో చిరుత పులి సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన దాసరి పెద్ద ఎల్లయ్య వ్యవసాయ పొలం వద్ద పశువులపాకపై చిరుత పులి దాడి చేసి ఒక లేగ దూడను చంపేసింది. ఉదయం పశువుల పాకకు వెళ్లిన రైతు లేగ దూడపై చిరుత దాడిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరారు.
News February 13, 2025
MDK: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.