News November 19, 2025

ఎలక్ట్రికల్ బస్సులకు స్థలం కేటాయింపునకు చర్యలు: మేయర్

image

ఎలక్ట్రికల్ బస్సులకు స్థల కేటాయింపునకు చర్యలు చేపట్టనున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ, ఇంజినీరింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పాల్గొని, సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. నగరం లో ఇందుకు అనువైన స్థలం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించి గుర్తిస్తామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.

Similar News

News January 21, 2026

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి జాతర తేదీలు ఖరారు..

image

చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు ఖరారయ్యాయి. జాతర వివరాలు..
➱ఫిబ్రవరి 22న (ఆదివారం) జాతర ప్రారంభం
➱23న (సోమవారం) పసుపు, కుంకుమ ముర్రాటలతో మొక్కుబడులు చెల్లింపులు
➱24న మంగళవారం రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.
వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

News January 21, 2026

తిరుమలలో ఆ దర్శనాలన్నీ రద్దు

image

రథసప్తమి రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో పలు దర్శన సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఎన్‌ఆర్‌ఐ, చంటి బిడ్డలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే తిరుపతిలో 24 నుంచి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను సైతం రద్దు చేశారు.