News March 26, 2024
ఎలక్షన్ కోడ్.. ఏలూరు జిల్లాలో ఉపాధ్యాయుడి సస్పెండ్

ఏలూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చింతలపూడి మండలం కంచనగూడెం SGT మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో చంచంరాజు టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో అతడిని సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ జిల్లా అధికారి ఎస్.అబ్రహం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించరాదని ఆయన సూచించారు.
Similar News
News February 16, 2026
నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌పై కేసు

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
News February 16, 2026
ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.
News February 16, 2026
నేడు యథావిధిగా PGRS

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు.


