News December 1, 2025

ఎలక్షన్ ఫీవర్.. మెదక్ ఎస్పీ హెచ్చరిక

image

మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా జరగాలంటే ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. గొడవలు, ప్రేరేపించే వ్యాఖ్యలు, ఓటర్లపై ఒత్తిడి, డబ్బు, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలకు ఆయుధాలు, మొబైల్‌లు నిషేధం. పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అనుమానాస్పద ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News February 13, 2026

మెదక్: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 సేవలు

image

మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా కో ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు లేదా సిబ్బందికి ఏదైనా అనారోగ్యం లేదా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఈ సేవలను వినియోగించుకోవాలని ఈఎంటీ అలీముద్దీన్, పైలెట్ అఫ్రోజ్ సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

News February 13, 2026

MDK: అనుమతి పత్రం ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి: ఎస్పీ

image

మెదక్ మున్సిపాలిటీ కౌంటింగ్ శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో వెస్లీ కళాశాలలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు సమీక్షించారు. అనుమతి పత్రాలు ఉన్నవారికే ప్రవేశం, కఠిన తనిఖీలు, మొబైల్ ఫోన్ల నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. BNSS 163 అమలులో ఉంటుందని, గుంపులు, ర్యాలీలు, డీజేలు నిషేధమన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 13, 2026

మెదక్: టెన్త్ క్లాస్ టాపర్‌కు బంపర్ ఆఫర్

image

నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్ గ్రామాలలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పరీక్షలలో మొదటి స్థానాన్ని పొందిన వారికి రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానం రూ.3 లక్షల నగదు, జిల్లా టాపరుకు రూ.2 లక్షలు, నియోజకవర్గస్థాయికి రూ.10 వేలు అందిస్తున్నామన్నారు.