News May 23, 2024

ఎలమంచిలిలో రెండు బైకులు ఢీ ఒకరు మృతి

image

లక్కవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు. నక్కపల్లి మండలం దోసలపాడుకి చెందిన లక్ష్మణరావు మరో ముగ్గురుతో కలిసి బైక్‌లపై గాజువాక బయలుదేరారు. లక్కవరం సమీపంలో వెనుక వస్తున్న బైక్ లారీని తప్పించబోయి ముందున్న బైక్‌ని ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావుకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Similar News

News March 8, 2026

విశాఖ ఏయూ అంబేడ్కర్ చైర్ ‘AgriAI’ పరికరం

image

విశాఖ ఏయూ అంబేద్కర్ చైర్ రూపొందించిన ‘AgriAI’ అనే వినూత్న పరికరాన్ని డైరెక్టర్ మనోజ్ తివారీ ప్రారంభించారు. ఇది IoT, AI సాంకేతికతతో పంటలను ఆశించే పురుగులను గుర్తించి, పంట స్థితిగతులను ఫొటోలతో సహా రైతులకు విశ్లేషిస్తుంది. LLM ఇంటిగ్రేషన్‌తో పనిచేసే ఈ పరికరం వ్యవసాయ క్షేత్రాల్లో విజయవంతంగా పరీక్షించబడింది, ఇది రైతులకు చీడపీడల నివారణలో ఎంతగానో తోడ్పడనుంది.

News March 8, 2026

BREAKING: విశాఖలో ఐటీ దాడుల కలకలం

image

విశాఖలోని మధురవాడ, అక్కయ్యపాలెం సహా నాలుగు ప్రాంతాల్లోని ‘సెలబ్రేషన్స్ హోటల్’ శాఖలపై ఆదివారం ఐటీ అధికారులు దాడులు చేశారు. జీఎస్టీ రిటర్న్స్‌లో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో కంప్యూటర్ డేటా, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. ఈ దాడుల నేపథ్యంలో అప్రమత్తమైన ఇతర హోటల్ యజమానులు తమ రికార్డులను సరిచూసుకుంటున్నారు.

News March 8, 2026

‘రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్’

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై పూర్తి వివరాలతో కూడిన అర్జీలను సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. మధ్యాహ్నం వరకు సాగే ఈ వేదికను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.