News November 6, 2025
ఎల్ఐసీ Q2 లాభాలు ₹10,053Cr

FY25 రెండో త్రైమాసిక(Q2) ఫలితాల్లో ఎల్ఐసీ ₹10,053Cr నికర లాభాలను ఆర్జించింది. గతేడాది(₹7,621Cr)తో పోలిస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నాటికి మొత్తం ఆదాయం FY24తో పోలిస్తే ₹2.29L Cr నుంచి ₹2.39L Crకు పెరిగింది. నెట్ ప్రీమియం ఆదాయం ₹1.19L Cr నుంచి ₹1.26L Crకు చేరింది. ఇక సంస్థల ఆస్తుల విలువ 3.31 శాతం వృద్ధితో ₹57.23L Crకు పెరిగింది.
Similar News
News January 20, 2026
ప్రజల దృష్టి మళ్లించేందుకు CM ఎత్తులు: లక్ష్మణ్

TG: ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న బాధ్యులు ఎవరో తేల్చకుండా CM రేవంత్ రెండేళ్లుగా దర్యాప్తు పేరిట కాలయాపన చేశారని BJP MP లక్ష్మణ్ విమర్శించారు. ‘ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ట్యాపింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాపింగ్‌పై కవిత చేసిన ఆరోపణలకు BRS సమాధానం చెప్పాలి’ అని ఢిల్లీలో ఆయన పేర్కొన్నారు. కలహాలతో BRS ముక్కలవుతుందని జోస్యం చెప్పారు.
News January 20, 2026
MSVPG హిట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

MSVPG హిట్ కావడంతో ప్రేక్షకులను ఉద్దేశించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మూవీపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణతో నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. మీరు లేనిదే నేను లేను. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది. స్క్రీన్‌పై నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై చూపించే ప్రేమ శాశ్వతం. మూవీ టీంకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News January 20, 2026
పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్‌ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.


