News March 26, 2024
ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు మహమ్మద్ నగర్ మండలం అసన్ పల్లికి చెందిన కురుమ ప్రశాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
మోపాల్: చెరువులో పడి పశువుల కాపరి మృతి: SI సుస్మిత

చిన్నాపూర్ చెరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మాణిక్యం (38) అనే పశువుల కాపరి మృతి చెందినట్లు మోపాల్ SI సుస్మిత తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా మండలానికి చెందిన మాణిక్యం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి కూలీ పనులు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం చెరువులో స్నానానికి వెళ్లి మృతి చెందాడన్నారు.
News February 18, 2026
కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తాం: నిజామాబాద్ కలెక్టర్

2002 ఓటర్ లిస్టు ప్రకారం కొత్త ఓటర్ లిస్టు మ్యాపింగ్ త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై CEO సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో కొంత జాప్యం జరిగిందని, ప్రస్తుతం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తామని తెలిపారు.