News October 30, 2024

ఎల్లారెడ్డి: ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి’

image

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్‌రావు కోరారు. ఆయన ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అధికారికంగా లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఎల్లారెడ్డి అని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Similar News

News November 2, 2024

నేడు బిక్కనూరులో పర్యటించనున్న షబ్బీర్ అలీ

image

శనివారం బిక్కనూరులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ఆయన ప్రారంభిస్తారని, అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. కార్యకర్తలు హాజరై ఆయన పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News November 1, 2024

పేకాట ఆడితే చర్యలు తప్పవు: కామారెడ్డి SP

image

పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని, జిల్లాలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయని KMR ఎస్పీ సింధూ శర్మ అన్నారు. ఇప్పటివరకు పేకాటలో 309 మందిపై కేసు నమోదు చేసి రూ.7,79,440 నగదుతో పాటు 146 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఎవరైనా పేకాడుతున్నట్లు తెలిస్తే వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారుల నంబర్లు 8712686109, 8712686133కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. 

News November 1, 2024

NZB జిల్లాలో దీపావళి రోజు 116 కేసులు

image

జిల్లా వ్యాప్తంగా గురువారం భారీగా పేకాట కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు ఇన్‌ఛార్జ్ కమిషనర్, కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ శుక్రవారం వివరాలను వెల్లడించారు. దీపావళి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 116 పేకాట కేసుల్లో 597 మంది పట్టుబడ్డారని తెలిపారు. వారి వద్ద రూ.11,47,240 స్వాధీనం చేసుకున్నామన్నారు.