News November 16, 2025
ఎల్లుండి ఉ.10 గంటలకు..

AP: ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈనెల 18న 10AMకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న 10AM వరకు నమోదుచేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బు చెల్లించాలి. 21న కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ తదితర టికెట్లు, 24న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, 25న రూ.300 టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.
Similar News
News January 16, 2026
ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.
News January 16, 2026
జనవరి 16: చరిత్రలో ఈ రోజు

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం
News January 16, 2026
జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.


