News November 17, 2025
ఎల్లుండి పుట్టపర్తికి ప్రధాని మోదీ

AP: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హిల్‌వ్యూ స్టేడియంలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20, 21 తేదీల్లో యువజన సదస్సులు, 22న సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం, 23న అధికారిక శతజయంతి వేడుకలను నిర్వహిస్తారు.
Similar News
News January 22, 2026
ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.
News January 22, 2026
ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?
News January 22, 2026
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.


