News December 1, 2025
ఎల్లో అలర్ట్.. కాసేపట్లో వర్షం

TG: ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంటలోపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News February 13, 2026
పెద్దపల్లి జిల్లాలో పార్టీల వారీగా విజేతల వివరాలు..!

పెద్దపల్లి జిల్లాలో 124 వార్డు స్థానాలు ఉండగా రామగుండం కార్పొరేషన్ లో ఒక డివిజన్ ఏకగ్రీవమైంది. మిగతా 123 వార్డులకు జరిగిన ఎన్నికలలో పార్టీల వారీగా బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ – 89, BRS – 16, BJP- 3, AIFB- 13, CPI- 1, స్వతంత్ర అభ్యర్థులు- 2 స్థానాలలో విజయం సాధించారు.
News February 13, 2026
జగిత్యాలలో జీవన్‌రెడ్డి అనుచరుల హవా!

TG: INCలో వివాదంగా మారిన జగిత్యాల మున్సి‘పోల్స్’లో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అనుచరులు రెబల్స్‌గా పోటీచేసిన అన్ని స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 50 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. BRS MLA సంజయ్ అనుచరులకు పార్టీ టిక్కెట్లు దక్కడంతో జీవన్ రెడ్డి అనుచరులు 14 చోట్ల పోటీచేశారు. వాటన్నిటిలోనూ విజయం సాధించారు. ఇక ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో INC 12, BJP 4, BRS 4, MIM 2 వార్డులను దక్కించుకున్నాయి.
News February 13, 2026
కోళ్లలో కొక్కెర వ్యాధిని ఇలా గుర్తించండి

కొక్కెర వ్యాధి సోకిన కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గి, శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లు బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3-4 రోజుల్లో మరణిస్తాయి.


