News March 4, 2025
ఎస్ఐ పోస్ట్ సాధించిన టైలర్ కూతురు

కోయిలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన టైలర్ కుమార్తె దివ్య దుర్గ ఎస్ఐ పోస్టు సాధించింది. దీంతో తండ్రి ప్రసాద్, తల్లి రాజేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన దివ్య స్ఐ పోస్టు సాధించడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 23, 2025
ఉప్పల్‌లో IPL మ్యాచ్.. జాగ్రత్త బ్రో!

HYDలోని ఉప్పల్ వేదికగా ఇవాళ IPL జట్లు SRH, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. అయితే స్టేడియంలో ఆకతాయిల పని పట్టేందుకు ‘షీ టీమ్స్’ మఫ్టీలో మహిళల రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమ్మాయిలను ఇబ్బంది పెడితే తాటతీసేలా చర్యలు ఉండనున్నాయి. మరోవైపు 2,700 మంది పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. IPL స్కోర్ అప్‌డేట్స్ కోసం Way2News ఫాలో అవ్వండి.
News March 23, 2025
పెద్ద పట్నం కార్యక్రమంలో పాల్గొన్న ఛైర్మన్

ప్రముఖ శైవ క్షేత్రం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చివరి ఆదివారం రోజున ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పెద్ద పట్నం, మల్లిఖార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
News March 23, 2025
ప.గో: పది నెలల పాటు జైలులోనే బాల్యం..!

పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పసల కృష్ణమూర్తి – అంజలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి ఆదివారం మృతి చెందారు. భీమవరం సబ్ కలెక్టరేట్ వద్ద జెండా ఎగురవేసిన సందర్భంలో కృష్ణ భారతి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించారని గ్రామస్థులు తెలిపారు. నాడు అంజలక్ష్మి ఆరు నెలల గర్భవతి. జైలులోనే కృష్ణ భారతికి అంజలక్ష్మి జన్మనిచ్చారు. కృష్ణ భారతి బాల్యం మొదటి పది నెలలు జైలులోనే గడిపారని తెలిపారు.