News May 7, 2025
ఎస్పీని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే

నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి పాణ్యం నియోజకవర్గంలో శాంతిభద్రతల అంశంపై చర్చించారు. పాణ్యం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని విధాల కృషి చేస్తామని ఈ మేరకు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
Similar News
News February 9, 2026
దీపారాధన తర్వాత కాలిన వత్తులను ఏం చేయాలి?

దీపం వెలిగించిన తర్వాత కాలిన వత్తులను, ఆ బూడిదను పవిత్రంగా భావించాలి. వీటిని ఎప్పుడూ చెత్తబుట్టలో, అపవిత్ర ప్రదేశాలలో పారేయకూడదు. 10 రోజుల పాటు సేకరించిన ఆ వత్తులను 11వ రోజున కర్పూరం, లవంగాలు వేసి కాల్చాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా తిప్పితే ప్రతికూల శక్తులు నశిస్తాయి. చివరగా మిగిలిన బూడిదను శుభకార్యాలకు వెళ్లే ముందు తిలకంలా ధరించవచ్చు. మొక్కల మొదట్లో వేస్తే మంచి జరుగుతుంది. వాటిని అపవిత్రం చేయకూడదు.
News February 9, 2026
భద్రాద్రి: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

భద్రాద్రి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారాలతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు.
News February 9, 2026
ఖమ్మం: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5 గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారంతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు. బుధవారం పోలింగ్ జరగనుంది.


