News October 6, 2025

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వర్తింపజేయాలి: మందకృష్ణ మాదిగ

image

కాకతీయ యూనివర్సిటీ మ్యాథమాటిక్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా మాదిగ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడుతూ.. ఉద్యోగులు విద్య, పేదరికం, ఆర్థిక పురోగతి లేని అత్యంత పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అన్ని డిపార్ట్మెంట్లలో వర్తింపజేయాలన్నారు.

Similar News

News January 22, 2026

రహదారి భద్రత ప్రతీ పౌరుడి బాధ్యత: విష్ణు చరణ్

image

రహదారి భద్రత ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతీ పౌరుడి బాధ్యత అని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు, క్రమశిక్షణ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు కీలకమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 22, 2026

మీరు మా వల్లే బతుకుతున్నారు.. కెనడా PMపై ట్రంప్ ఫైర్

image

దావోస్ వేదికగా కెనడాపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ‘US వల్లే కెనడా బతుకుతోంది. మా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. మీకు కృతజ్ఞత లేదు. మార్క్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకో’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా లాంటి పెద్ద దేశాలు తమ ఆర్థిక శక్తిని వాడుకుని ఇతర కంట్రీస్‌ను భయపెడుతున్నాయని, అందుకే మధ్యస్థ దేశాలన్నీ ఏకం కావాలని కెనడా PM మార్క్ కార్నీ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ సీరియస్ అయ్యారు.

News January 22, 2026

రేపు భక్తులకు అమ్మవారి జోగులాంబ నిజరూప దర్శనం

image

వసంత పంచమి పురస్కరించుకొని రేపు అలంపూర్ పట్టణంలోని ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. అలంపూర్ పట్టణంలో మహిళలు రేపు పెద్ద సంఖ్యలో పంచామృత కలశాలతో పట్టణంలో ఊరేగింపుగా వచ్చి శ్రీ జోగులాంబ అమ్మవారికి కలశాభిషేకం చేసి దర్శించుకొనున్నారు. ప్రతి సంవత్సరం వసంత పంచమిన జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.