News May 7, 2025

ఏఈపీఎస్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ఏఈపీఎస్ పద్ధతిలో నకిలీ వేలిముద్రలతో నగదు దోచుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. మోసాల నుంచి రక్షణ కోసం ఎంఆధార్ యాప్‌ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే అన్లాక్ చేసి, వెంటనే మళ్లీ లాక్ చేయాలని, ఇటీవలి కాలంలో వేలిముద్రలు వినియోగించిన చోట్ల డీలింక్ చేయాలన్నారు. మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News February 18, 2026

60 రోజుల్లోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలి: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని SP వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 60 నుంచి 90 రోజులలోపు చార్జ్ షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నారు. ఆస్తి నేరాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి గస్తీని బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

News February 18, 2026

గుంటూరు: కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

image

ఇళ్ల నిర్మాణాల్ని మధ్యలోనే ఆపేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయా అధికారులను ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాల లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పనులు చేసుకోవచ్చన్నారు. బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

News February 18, 2026

పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

image

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.