News December 2, 2025

ఏకాంత సేవలో ఆంతర్యం ఏంటంటే?

image

శ్రీవారి ఆరాధనలో రోజూ రాత్రి జరిగే చివరి సేవను ఏకాంత సేవ (లేదా) పవళింపు సేవ అంటారు. ఈ సేవలో వెండి మంచం, పట్టు పరుపుపై భోగ శ్రీనివాస మూర్తిని వేంచేపు చేస్తారు. స్వామిని నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ సమయంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించి, తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి సమర్పిస్తారు. ధనుర్మాసంలో భోగ శ్రీనివాసునికి బదులుగా, కృష్ణ భగవానునికి ఈ ప్రత్యేక ఏకాంత సేవను నిర్వహించడం ఆనవాయితీ. <<-se>>#VINAROBHAGYAMU<<>>

Similar News

News February 19, 2026

మెదక్: ‘ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలి’

image

మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావును గ్రూప్-1 శిక్షణ అధికారులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. అధికారులు క్రమశిక్షణ, నిజాయితీతో పాటు మానవత్వంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ ఉత్తమ అధికారులుగా పేరు తెచ్చుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

ఉత్కంఠ పోరు.. భారత్ విజయం

image

T20WC: నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచులో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టీమ్ ఇండియా 20 ఓవర్లలో 193/6 రన్స్ చేయగా నెదర్లాండ్స్ 176/7 పరుగులు చేసింది. 19వ ఓవర్లో 18 రన్స్ రావడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే చివరి ఓవర్ దూబే కట్టుదిట్టంగా వేయడంతో భారత్ గెలిచింది. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సత్తా చాటారు. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది.