News February 3, 2025
ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.
Similar News
News February 11, 2025
సిద్దిపేట జిల్లాలో రూ.75 కోట్లతో ఆలయాల అభివృద్ధి: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లాలో రూ.75 కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కొనాయిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 15 నెలలుగా దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. కొత్తగా ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను నిలిపివేశారని ఆరోపించారు.
News February 11, 2025
కృష్ణా జిల్లాలోనూ బర్డ్‌ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు

AP: ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న <<15428552>>బర్డ్ ఫ్లూ<<>> కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం(M)లో వైరస్ నిర్ధారణ అయ్యింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల 10KM పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. కాగా 100డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
News February 11, 2025
పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్

బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.