News November 30, 2025

ఏటూరునాగారంలో సర్పంచ్ బరిలో ఇద్దరు ‘శ్రీలత’లే

image

ఏటూరునాగారంలో సర్పంచ్‌గా పోటీ చేసే ఇద్దరు మహిళా అభ్యర్థుల పేర్లు శ్రీలత కావడం గమనార్హం. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి కాకులమర్రి శ్రీలత పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి గుడ్ల శ్రీలత బరిలో ఉన్నారు. అయితే, ఇద్దరి పేరు ఒకేలా ఉండటంతో కొంతమంది నిరక్షరాస్యులు, వృద్ధులు తికమక పడుతున్నారు. కాగా, స్థానిక ఎన్నికలకు పార్టీ గుర్తులు సైతం ఉండకపోవడంతో ఎన్నికల కమిషన్ కేటాయించే గుర్తులతో ప్రచారం చేయనున్నారు.

Similar News

News February 13, 2026

స్కూళ్లను బాగు చేస్తే ప్రమాణాలు ఎందుకు దిగజారాయి: లోకేశ్

image

AP: స్కూళ్లలో సదుపాయాల కోసం ₹7500 CR ఖర్చు చేయాల్సి ఉందని మంత్రి లోకేశ్ శాసనమండలిలో తెలిపారు. ‘18 అంశాల్లో స్కూళ్లకు రేటింగ్ ఇవ్వగా 40% 2 స్టార్ కన్నా తక్కువ ఉన్నాయి. 84.3% 3వ తరగతి, 62.5% 5వ తరగతి, 47% 8వ తరగతి విద్యార్థులు 2వ క్లాస్ పాఠ్య పుస్తకాలను చదవలేకపోయారు. YCP హయాంలో అద్భుతంగా చేస్తే లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంతలా ఎందుకు పడిపోయాయి’ అని ప్రశ్నించారు. వీటిని మెరుగుపరుస్తామని చెప్పారు.

News February 13, 2026

BIG BREAKING: నల్గొండలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్

image

నల్గొండ జిల్లాలోని మున్సిపల్ పీఠాలన్నీ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీలకు గాను 6 కాంగ్రెస్ గెలిచింది. మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చిట్యాల, చండూరు, నందికొండలో అత్యధిక వార్డులు గెలుపొంది, మున్సిపల్ ఛైర్మన్ల పీఠాలను కైవసం చేసుకుంది.

News February 13, 2026

సిరిసిల్లలో BRS విజయం, ధర్మపురిలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో BRS విజయం సాధించింది. ఆ మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా 27 చోట్ల BRS గెలిచింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డు సొంతం చేసుకున్నారు. అటు జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది.