News August 23, 2025

ఏటూరునాగారం: గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణం!

image

79 ఏళ్ల స్వతంత్ర భారతంలో గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్న గిరిజన గ్రామాలు, పల్లెలు అనేకమున్నాయి. ములుగు జిల్లాలోని గంటలకుంట అనే గిరిజన గ్రామంలో బిందెడు నీటి కోసం రెండు మైళ్ల దూరంలోని వాగులో చెలిమి తీసి నీటిని తెచ్చుకుంటున్న గిరిజనుల బాధలు వర్ణనాతీతం. తల్లికి సాయంగా కొడుకు తలపై గిన్నెలు, తల్లి తలపై రెండు మంచినీటి బిందెలతో గూడెం వాసుల తాగునీటి కష్టాలు మాటల్లో చెప్పలేనివి.

Similar News

News January 20, 2026

చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: మంత్రి డోలా

image

AP: సింహాచలం నరసింహస్వామి చందనోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయులు ఆదేశించారు. APR 20న చందనోత్సవం సందర్భంగా 19వ తేదీ రాత్రి 6గంటల నుంచే సాధారణ దర్శనాలు నిలిపివేస్తామని SM ద్వారా భక్తులకు తెలపాలన్నారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. FEBలో సమావేశానికి యాక్షన్ ప్లాన్‌తో రావాలని కలెక్టర్, ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పేర్కొన్నారు.

News January 20, 2026

చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్

image

చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ రాజేంద్రన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా నుంచి ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో జేసీగా ఉన్న విద్యాధరి వైజాగ్‌కు బదిలీ అయిన సంగతి తెలిసిందే. పలువురు రెవెన్యూ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News January 20, 2026

నంద్యాల జిల్లాకు దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో దేశంలోనే అతిపెద్ద సింగిల్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జి. రాజకుమారి వెల్లడించారు. 600/1200 మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ఈ భారీ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.