News January 27, 2025
ఏటూరునాగారం: పొలాల్లో అద్భుత దృశ్యం అవిష్కృతం

ఏటూరునాగారంలోని జీసీసీ గ్యాస్ గోడౌన్ వెనకాల గల వరి పొలాల్లో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ ఎండిపోయిన చెట్టుపై అక్కడికి మేత కోసం వచ్చిన కొంగలు భారీ సంఖ్యలో వాలాయి. దీంతో పూర్తిగా ఆకులు రాలిపోయిన చెట్టుపై కొంగలు వాలడంతో ఆ దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది. పొలాల్లో వివిధ పనులకు వచ్చిన కూలీలు చెట్టుపై ఉన్న కొంగల దృశ్యాలను చూసి మైమరిచిపోయారు.
Similar News
News February 9, 2025
NLG: ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఓట్ల వేట!

MLC ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 10వ తేదీ వరకు అవకాశం ఉండగా పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ 13తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు బరిలో దిగుతున్నారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నోటిఫికేషన్ ముందు నుంచే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
News February 9, 2025
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తొగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన భూక్య కమలమ్మ(60) మరణించింది. స్థానికుల సమాచారం మేరకు.. మణుగూరు నుంచి అశ్వాపురం వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో బుల్లెట్ బండి ఢీకొని తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయని అన్నారు.
News February 9, 2025
MDK: రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

సిద్దిపేట జిల్లా చేగుంట, గజ్వేల్ రహదారిపై నర్సపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వేణు(48), శివమణి(15), విష్ణు ఒడి బియ్యం పోయించుకోడానికి భార్యను బస్సులో పంపి ఇద్దరు కూమారులతో బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ను లారీ ఢీ కొట్టగా తండ్రి వేణు, కుమారుడు శివమణి అక్కడికక్కడే మృతి చెందారు.