News September 10, 2025
ఏటూరునాగారం బాయ్స్ స్కూల్‌లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ

ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ స్పోర్ట్స్ స్కూల్‌లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న 58 బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 6వ తరగతిలో 24, 7వ తరగతిలో 18, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి SEP 15న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. బ్యాటరీ టెస్టుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News December 11, 2025
రాజాపూర్: మెజార్టీ పెంచిన రీ కౌంటింగ్

ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంతూరు రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడెంలో బీజేపీ గెలుపొందింది. మొదట కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అంజలిపై 6ఓట్లతో బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటేపాగ రేవతి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు రీ కౌంటింగ్ కోరడంతో నిర్వహించిన రీకౌంటింగ్‌లో రేవతికి 36ఓట్ల మెజార్టీ లభించినట్లు అధికారులు ప్రకటించారు.దీంతో విషయం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశమైంది.
News December 11, 2025
VZM: జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఏడుగురు క్రీడాకారులు ఎంపిక

కలకత్తాలో ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న సీనియర్ సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలకు విజయనగరం జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అనిల్ కుమార్, పి.నవీన్, ఎం.దుర్గాప్రసాద్, ఎం.లావణ్య, ఏ.తేజస్విని, పి.మౌనిక, చైతన్యకుమారి ప్రతిభ కనబరచడంతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని సాఫ్ట్ బాల్ జిల్లా అధ్యక్షుడు బేబినాయన, కమిటీ సభ్యులు అభినందించారు.
News December 11, 2025
NZB: కొనసాగుతున్న కౌంటింగ్.. వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1642 వార్డులకు గురువారం జరిగిన పోలింగ్ అనంతరం నిర్వహించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. తాజా సమాచారం మేరకు కాంగ్రెస్ తరపున 51, BRS నుండి ఏడుగురు, BJP నుంచి ఆరుగురు, ఇతరులు 5గురు సర్పంచ్ లుగా విజయం సాధించారు.


