News September 12, 2025

ఏటూరునాగారం: Way2News కథనానికి స్పందన!

image

ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘనపురానికి చెందిన యాకూబ్ పాషా పేరుపై ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, తన భార్య పేరుపై పట్టా మార్చాలని అధికారులు చెప్పారు. దీంతో అతడు పేరు మార్చగా, బిల్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై గురువారం<<17676717>> ‘అధికారుల తప్పిదంతో ఇందిరమ్మ బిల్లు ఆగింది’<<>> అనే శీర్షికతో Way2News కథనం ప్రచురించగా, అధికారులు స్పందించారు. బాధితుడి ఇంటికి వెళ్లి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు.

Similar News

News December 13, 2025

పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’

image

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రెండో శుక్రవారం ₹34.70 కోట్ల కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో హిందీ పుష్ప-2(₹27.50Cr) రికార్డును బద్దలు కొట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో ఛావా(₹24.30Cr), యానిమల్(₹23.53Cr), గదర్-2(₹20.50Cr), హిందీ బాహుబలి-2(₹19.75Cr) ఉన్నాయి. ఓవరాల్‌గా ధురంధర్ మూవీ ₹300+Cr <<18544001>>కలెక్షన్లు<<>> సాధించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.

News December 13, 2025

రూ.3600 కోట్లతో హరియాణా క్లీన్ ఎయిర్ ప్లాన్!

image

గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు హరియాణా ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్‌తో MoU కుదుర్చుకుంది. రూ.3,600 కోట్లతో ‘హరియాణా క్లీన్ ఎయిర్ ప్రాజెక్ట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ను ప్రారంభించింది. ఐదేళ్లలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో (National Capital Region) గాలి నాణ్యత మెరుగుపరచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 500 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, 50,000 ఈ-ఆటోలకు ప్రోత్సాహకాలు అందించడం వంటివి ప్రతిపాదనలో ఉన్నాయి.

News December 13, 2025

పెద్దపల్లి జోన్‌లో సెక్షన్ 163 BNSS అమలు: సీపీ

image

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జోన్‌లోని అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించేందుకు ఈ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరించారు.