News May 23, 2024

ఏడాదిలో రెండు ఓపెన్ కాస్ట్ గనుల మూసివేత!

image

రానున్న ఏడాది కాలంలో సింగరేణికి సంబంధించి రెండు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను మూసివేసే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాజెక్టులలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కావడంతో మూసివేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. రామగుండం రీజియన్‌లోని OCP-1, శ్రీరాంపూర్ ప్రాంతంలోని రామకృష్ణాపూర్ ఓసీపీలో బొగ్గు నిక్షేపాలు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది నాటికి దాదాపుగా వీటిని మూసివేసే అవకాశం ఉంది.

Similar News

News March 8, 2026

కరీంనగర్‌లో రేపు 2కే రన్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో MCK నుండి అంబేద్కర్ స్టేడియం వరకు రేపు ఉదయం 6.30 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్పొరేషన్ లో E-వేస్ట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

News March 8, 2026

కరీంనగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ప్రజావాణి కార్యక్రమానికి, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ స్థానంలో ఇతర అధికారిని డిప్యూట్ చేయాలని, ప్రజల నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని తెలిపారు.

News March 7, 2026

KNR: తహశీల్దార్‌పై ఏసీబీ పంజా.. రూ.4 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

image

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.