News July 5, 2024
ఏడుగురికి ఏఎస్ఐగా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో వెంకటేశ్వర్లు(698), పద్మ కుమార్ (1537), శైలజ (2247), బాలస్వామి (608), బసవ నారాయణ (1994), వెంకటకృష్ణ (428), సూర్యచంద్రరావు (384) ఉన్నారు. వీరికి ఒకటి రెండు రోజుల్లో పోస్టింగ్ కేటాయించే అవకాశం ఉంది.
Similar News
News December 16, 2025
ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు చర్యలు: కలెక్టర్

రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో టీజీఐఐసీకి కేటాయించిన భూములను మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత, రహదారి అనుసంధానం, మౌళిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించారు. భూముల సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేసి కేటాయించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
News December 16, 2025
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం సీపీ

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతిఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 16, 2025
ఖమ్మం: పంచాయతీ పోరులో ‘నోటు’ స్వామ్యం

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అభివృద్ధి హామీల కంటే డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీకే ప్రాధాన్యం ఇవ్వడంతో పల్లె ఎన్నికలు ‘నోటుస్వామ్యం’లా మారాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.10 వేలు, మాంసం పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ రహిత ఎన్నికల్లో జిల్లా నాయకుల ప్రచారం చర్చనీయాంశమైంది.


