News May 7, 2025
ఏడుపాయల చెక్ డ్యాంలో మునిగి వ్యక్తి మృతి

ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సమీపంలో చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు నీట మునిగి వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా కొత్తపల్లి మండలం మరికల్‌కు చెందిన దేవరపాగ వీరస్వామి(40) శుక్రవారం ఓ విందు నిమిత్తం కుటుంబంతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. స్నానం చేసేందుకు ఆలయ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు వెళ్లిన వీరస్వామి స్నానం చేస్తుండగా నీట మునిగి మృతి చెందారు. దీంతో విందులో విషాదం నెలకొంది.
Similar News
News February 13, 2026
ఖమ్మం: భక్తులకు గమనిక

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.
News February 13, 2026
ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇస్తుందా?

T20 WCలో జింబాబ్వేపై రికార్డు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు 2007లో తలపడిన మ్యాచులో ZIMనే విజయం సాధించడం దీనికి కారణం. 19 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఇవాళ ఉ.11 గంటలకు తలపడనున్నాయి. ఈ టోర్నీలో AUS, జింబాబ్వే చెరో విజయంతో గ్రూప్-Bలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ మ్యాచులో ఆస్ట్రేలియాకు ZIM మరోసారి షాక్ ఇస్తుందా? లేదా AUS ఆధిపత్యం కొనసాగిస్తుందో చూడాలి.
News February 13, 2026
కర్నూలు విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన కర్నూలు విద్యార్థిని జాహ్నవి(23) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 2023 జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.


