News November 5, 2025
ఏపీలో అగ్రస్థానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ

క్యూఎస్ ఏషియా సంస్థ విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సర ర్యాంకింగ్స్‌లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 761-770 ర్యాంక్ సాధించింది. దీంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ 801-850 ర్యాంకుల్లో, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ 851-900 ర్యాంక్‌లో, శ్రీకృష్ణ యూనివర్సిటీ 1001-1100 ర్యాంక్‌లో నిలిచాయి. ఈ విజయంపై రిజిస్ట్రార్ సింహాచలం అభినందించారు.
Similar News
News January 25, 2026
ఆకర్షణీయంగా ముస్తాబైన తిరుపతి కలెక్టరేట్

గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేడుకల సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ త్రివర్ణ విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ముస్తాబైంది. రాత్రి వేళల్లో కలెక్టరేట్ భవనం నలువైపులా ఈ మూడు రంగుల విద్యుత్ దీపాలతో కాంతులు విరజిమ్ముతూ అత్యంత సుందరంగా, పండుగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తోంది.
News January 25, 2026
NZB: మున్సిపల్ ఎన్నికల BRS ఇన్‌ఛార్జీలు వీరే..

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని కీలక ప్రాంతాలకు ఇన్‌ఛార్జీలను నియమించింది. నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డికి అప్పగించారు. బోధన్ మున్సిపాలిటీకి దాదన్నగారి విఠల్ రావు, ఆర్మూర్‌కు చెరుమల్ల రాకేష్, బాల్కొండకు సుమనా రెడ్డిలను ఇన్‌ఛార్జీలుగా అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తూ గెలుపే లక్ష్యంగా వీరు పనిచేయనున్నారు.
News January 25, 2026
విడవలూరు: 54 మంది అరెస్ట్

విడవలూరు(M) పెద్దపాలెం బంకింగ్ కెనాల్ వద్ద కోడిపందేల స్థావరాలపై పోలీసులు <<18948979>>దాడులు<<>> చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 54 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ సురేంద్రబాబు తెలిపారు. వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 2 ఆటోలు,14 కోళ్లు, కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులపై సైతం కేసులు నమోదు చేశామన్నారు.


