News December 3, 2025

ఏపీలో సమగ్ర క్యాన్సర్ చికిత్సకు ప్రత్యేక చర్యలు: MP సానా

image

ఏపీలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎంపీ సానా సతీష్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో క్యాన్సర్ పై మాట్లాడరని ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆయుష్ శాఖ మంత్రి క్యాన్సర్ నివారక చికిత్సలు వాటికి సంబంధించి ఏపీలో జరుగుతున్న విధానాన్ని తెలియజేశారని కార్యాలయం వెల్లడించింది. ఆయుష్‌కు ఆధునిక వైద్యాన్ని ముడిపెట్టి చికిత్సలు అందిస్తారన్నారు.

Similar News

News February 13, 2026

7 తరాలు మర్చిపోవు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

image

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ‘మా లైన్లోకి రాకపోతే (ఇటీవల రూ.10కోట్లు డిమాండ్ చేశారు) జరిగే పరిణామాలు వచ్చే 7 తరాలు మర్చిపోవు’ అని ఆడియో మెసేజ్‌లో రణ్‌వీర్‌ను హెచ్చరించింది. ‘మీ స్టాఫ్, వారి ఫ్యామిలీ మూమెంట్స్ సేకరించాం. వారిపై దాడి చేస్తే మీకు తెలిసి వస్తుందేమో’ అని గ్యాంగ్‌లోని హారీ బాక్సర్ పేరుతో వార్నింగ్ వచ్చింది.

News February 13, 2026

సిరిసిల్ల: ‘ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతిఒక్కరూ తప్పక పాటించాలని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. సిరిసిల్ల, వేములవాడ పరిధిలోని సినారె కళామందిరాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజే కార్యక్రమాలు, టపాసులు పేల్చడం, భారీగా గుంపులు గుంపులుగా గుమి కూడడం, ఫంక్షన్ హాల్స్ లో సమావేశం ఏర్పాటు చేయడం నిషేధమన్నారు.

News February 13, 2026

ఓపెన్ ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ శాఖల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 2 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అధికారులు బృంద స్ఫూర్తితో పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని సూచించారు. నిబంధనల అమలులో ఎలాంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు.