News April 28, 2024
ఏపీ సెట్ – 24కు సర్వం సిద్ధం

ఏపీ సెట్ – 2024 పరీక్ష ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో కాకుటూరులోని వర్సిటీ కళాశాల, జగన్స్ కాలేజీ, కృష్ణచైతన్య డిగ్రీ కాలేజీ, రావూస్ డిగ్రీ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాల, వీఆర్ ఐపీఎస్ లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ఏపీ సెట్ ప్రాంతీయ సమన్వయకర్త వీరారెడ్డి తెలిపారు. 1767 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News April 16, 2026
మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: నెల్లూరు జేసీ

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగుతోందని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్ముకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని, సమస్యలు ఉంటే 1967, 85208 79979 నంబర్లను సంప్రదించాలని కోరారు. విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
News April 16, 2026
నెల్లూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 12.85 లక్షలు

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రధాన ఘట్టమైన ఓటర్ల జాబితాను పూర్తి చేశారు. జిల్లాలో 700 గ్రామ పంచాయతీల్లో 12,85,757 ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 6,29,276 మంది, మహిళలు 6,56,403 మంది, ట్రాన్సజెండర్లు 78 మంది ఉన్నారు. 35 మండలాల్లో 700 గ్రామాల్లో 6658 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించారు.
News April 16, 2026
నెల్లూరు GGH ఉద్యోగాల మెరిట్ జాబితా విడుదల

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ‘డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్’లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మార్చి 31-ఏప్రిల్ 9 వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను spsnellore.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల (ఏప్రిల్) 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు


