News March 28, 2024

ఏప్రిల్ 1 నుంచి మెమూ రైళ్ల పునరుద్ధరణ

image

బిట్రగుంట – విజయవాడ, బిట్రగుంట – చెన్నై మధ్య నడిచే మెమూ రైళ్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రెండు రైళ్లను ఇప్పటికే పునరుద్ధరణ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి రైల్వే అభివృద్ధి కమిటీకి కూడా సమాచారం పంపారు.

Similar News

News February 16, 2026

ఉదయగిరి జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 16, 2026

నెల్లూరు: అడవిలో తప్పిపోయిన 12 మంది భక్తులు సేఫ్

image

రాపూరు (M) పంగిలి గ్రామ సమీపంలోని మామిడికొనలో ఉన్న వెలసిన శ్రీ మల్లయ్యస్వామి వారి దర్శనార్థం నెల్లూరు సిటీ అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది టెంపోలో వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పంగిలి గ్రామానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి కారణంగా 12 మంది దారి తప్పిపోయారు. పోలీసులు గాలించి వారిని బంధువులకు అప్పగించారు.

News February 16, 2026

చంద్రబాబు బడ్జెట్ అంతా మోసం, అబద్ధాలు : కాకాణి

image

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషాదకరమని, ప్రజల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందన్నారు. వైసీపీ హయాంలో ఐదు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆమోదయోగంగా ఉందన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం వెనకడుగు వేయకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమన్నారు.