News July 4, 2024

ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గడువు పెంపు

image

ఏయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో విద్యను అభ్యసిస్తున్న వారు పరీక్షల దరఖాస్తుకు ఈనెల 10వ తేదీలోగా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్ తెలిపారు. రూ.5 వేల అపరాధ రుసుముతో తత్కాల్ విధానంలో ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసిన వారికి విశాఖలో పరీక్షలు నిర్వహిస్తారు.

Similar News

News December 10, 2025

కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర శోభ

image

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీచక్రనవావర్ణార్చన, లక్ష్మీహోమం జరిగాయి. గురువారంభక్తుల రద్దీ దృష్ట్యా పూజా సమయాలను కుదించినట్లు ఈవో తెలిపారు. భక్తులు ఆన్‌లైన్, వాట్సాప్ (9552300009) ద్వారా దర్శనం, ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీలు, వృద్ధులు నిర్ణీత సమయాల్లోనే రావాలని కోరారు.

News December 10, 2025

ఏయూలో డిసెంబర్ 15 నుంచి ‘సరస్’ ఎగ్జిబిషన్: కలెక్టర్

image

మహిళల స్వయం సాధికారత కోసం డిసెంబర్ 15 నుంచి 26 వరకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ‘సరస్’ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. దేశవ్యాప్తంగా 600 మంది డ్వాక్రా మహిళలు 250 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హ్యాండ్‌లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ ప్రదర్శనను ఆదరించాలని కలెక్టర్ కోరారు.

News December 10, 2025

పేదల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేసి, మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో, రోజుకు 200 ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. గడువులోగా పూర్తి చేయకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు అవుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.