News August 23, 2025

ఏలూరులో కోర్టు మానిటరింగ్ సమీక్ష

image

ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాలపై జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. సాక్షులు సమయానికి హాజరైతే కేసుల విచారణ వేగవంతమవుతుందని, నేరస్థులు శిక్ష తప్పించుకోకుండా బాధితులకు న్యాయం జరుగేలా చూడాలని సూచించారు. సభ్యులు ప్రతిరోజూ కోర్టు ప్రక్రియను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Similar News

News January 20, 2026

కరీంనగర్: ప్రయోగశాలల సామగ్రికి టెండర్ల ఆహ్వానం

image

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్‌లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.

News January 20, 2026

బోరాబండలో దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

image

HYD బోరాబండలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

News January 20, 2026

చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

image

మిగతా సీజన్​లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్​లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.