News March 7, 2025

ఏలూరు: ఇంటర్ పరీక్షకు 400 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో శుక్రవారం జరిగిన సెకండ్ ఇయర్ ఇంటర్ లెక్కల పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ యోహాను తెలిపారు. పరీక్షకు 400 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం 14,616 మంది విద్యార్థులు ఉండగా 14,216 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 275 మంది ఒకేషనల్ విద్యార్థులు 125 మంది హాజరు కాలేదన్నారు. 

Similar News

News December 17, 2025

WNP: 102 అంబులెన్స్‌ డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

వనపర్తి జిల్లాలోని 108 అంబులెన్స్‌ల్లో పైలట్‌ (డ్రైవర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ మహమూద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎల్‌ఎంవీ (బ్యాడ్జి) లైసెన్స్‌ ఉండి, 23 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ముఖాముఖికి హాజరుకావాలని ఆయన కోరారు.

News December 17, 2025

సిద్దిపేట జిల్లాలో మూడో విడతలో 88.45% పోలింగ్

image

సిద్దిపేట జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 88.45% పోలింగ్ శాతం నమోదైందని అధికారులు తెలిపారు. అక్కన్నపేట-88.06%, చేర్యాల-86.97%, ధూల్మిట్ట-89.70%, హుస్నాబాద్-89.46%, కోహెడ-88.38%, కొమురవెల్లి-87.49%, కొండపాక-89.05%, కుకునూరుపల్లి-91.08%, మద్దూరు-88.24% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.

News December 17, 2025

BIG BREAKING: MLAల అనర్హత పిటిషన్ల కొట్టివేత

image

TG: ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెల్లం వెంకట్రావు, గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత పిటిషన్లను కొట్టేస్తూ వారికి క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించినట్లు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేశారు. ఆ ఎమ్మెల్యేలు సాంకేతికంగా BRSలోనే ఉన్నట్లు వెల్లడించారు. కాగా రేపు పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌పై స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.