News November 26, 2024
ఏలూరు: ఇద్దరు మిత్రులు అరెస్ట్.. 6 కార్లు రికవరీ
ఏలూరులో సెల్ఫ్ డ్రైవింగ్‌కు కార్లను తీసుకుని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సా చేసుకుంటున్న అభిషేక్ (34), భానుచందర్ (39) అనే ఇద్దరు మిత్రులను అదుపులోకి తీసుకున్నామని ఏలూరు రేంజ్ డీఎస్పీ శ్రావణ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు ముద్దాయిల నుంచి 6 కార్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. పత్రాలు లేకుండా బైక్, కార్లు తాకట్టు పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 7, 2024
జాతీయ స్థాయి యోగా పోటీలకు తణుకు విద్యార్థుల ఎంపిక
ఇటీవల రాజమండ్రిలో సౌత్ జోన్ యోగా ఎంపికల్లో తణుకు ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సుందరి బాయ్ తెలిపారు. ఎంపికైన భవానీ ప్రసన్న, నాగలక్ష్మి దుర్గ, జ్యోతి, సౌమ్య నాగవల్లి ఈనెల 24 నుంచి 27 వరకు భువనేశ్వర్ కిట్టి యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఎంపికలకు హాజరవుతారని చెప్పారు. వీరిని కళాశాల సెక్రటరీ చిట్టూరి సత్య ఉషారాణి శుక్రవారం అభినందించారు.
News December 6, 2024
డిసెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: ప.గో కలెక్టర్
పేదల ఇళ్ల నిర్మాణాలపై జిల్లాలోని అన్ని మండలాల హౌసింగ్ డిఈలు, ఎఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పగో జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 3,159 నిర్మాణాల లక్ష్యంలో 1,737 మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ఇంకా పూర్తి చేయవలసిన 1,422 ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News December 6, 2024
ప.గో: 111 మంది ఉద్యోగుల తొలగింపు
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 111 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ డీఎంహెచ్‌వో శర్మిష్ట గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతలున్నప్పటికీ మెరిట్ లేకుండా పొందిన ఉద్యోగ నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవో 1207ని కొట్టి వేస్తూ ఉద్యోగాలు పొందిన వారు మెరిట్‌ప్రకారం రిక్రూట్ అయిన వారిని కొనసాగించాలని నవంబరు 29న తుదితీర్పులో కోర్టు ఆదేశించింది.