News August 18, 2024
ఏలూరు: ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు: MP
ధవళేశ్వరంలోని పోలవరం కుడికాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఇలాంటివి పునరావృతం కాకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Similar News
News September 11, 2024
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం
దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కష్టజీవులు మరణించడం ఎంతో బాధాకరమని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సొషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముకులు వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News September 11, 2024
కొవ్వూరు: మృతులకు న్యాయం చేస్తాం: MLA
దేవరపల్లి మండలం చిన్నాయగూడెం జీడిపిక్కల వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన మృతదేహాలను కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల బంధువులు ఆసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వర రావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వ తరఫున రూ.5 లక్షలు, ఫ్యాక్టరీ తరఫున రూ.3 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
News September 11, 2024
ఏలూరు: గణేశ్ నిమజ్జనంలో వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం
నిడదవోలులోని బసిరెడ్డిపేట రేవు వద్ద వినాయక నిమజ్జన సమయంలో చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో <<14072518>>గల్లంతైన<<>> విషయం తెలిసిందే. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన జాలర్లకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదుచేశారు.