News March 4, 2025

ఏలూరు: ఎమ్మెల్సీగా గెలిచిన కూటమి అభ్యర్ధి పేరాబత్తుల 

image

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయం సాధించారు. ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చేతుల మీదుగా ఆయన గెలుపు పత్రం అందుకున్నారు. రాజశేఖరం వెంట ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఉన్నారు. రాజశేఖరం గెలుపుతో కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

Similar News

News December 17, 2025

VZM: 20 నుంచి ఆర్టీసీ డోర్ డెలివరీ మాసోత్సవాలు

image

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు ఆర్టీసీ కార్గో సేవల్లో డోర్ డెలివరీ మాసోత్సవాలను నిర్వహిస్తామని విజయనగరం జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. నగరాల్లో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ చేస్తామన్నారు. తక్కువ ధరతో వేగంగా, సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News December 17, 2025

ఆదిలాబాద్: సర్పంచ్ అభ్యర్థిపై కేసు

image

గుడిహత్నూర్ మండలం ముత్నూర్ తండాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి రాథోడ్ సుభాశ్ ప్రజలకు నగదు పంపిణీ చేస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.2,700 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించాలని, ఇలాంటి సమాచారం ఉంటే డయల్ 100కు తెలియజేయాలని ఆయన సూచించారు.

News December 17, 2025

భైంసా: ఆ ఒక్క ఓటే.. అభ్యర్థి గెలుపునకు విజయం

image

రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన సర్పంచులు ఉన్నారు. ఒకటో విడతలో కడెం (M) కల్లెడలో, రెండో విడతలో లోకేశ్వరం (M) బాగపూర్లో ఇద్దరు సర్పంచులు ఒక్క ఓటుతో గెకుపోందారు. అయితే ఈ చివరి దశ ఎన్నికల్లో కూడా చాలా ఒక్క ఓటు కీలకం కానుందంటున్నారు. అందుకే ఆ ఓటు మీదే కావచ్చుగా.. మరి ఎందుకు ఆలస్యం ఓటు వేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. చలో పాద పోలింగ్ కేంద్రానికి.