News December 2, 2025

ఏలూరు: ‘గృహ నిర్మాణానికి దరఖాస్తు పొడిగింపు’

image

ఏలూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటి నిర్మాణ దరఖాస్తుకు గడువు పొడిగించడం జరిగిందని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆవాస్ ప్లస్ 2024 సర్వే పూర్తి చేయడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అదనంగా డిసెంబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించడం జరిగిందన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని వారు, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 12, 2026

తాగునీటి సమస్యనా? ఫోన్ చేయండి

image

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీఓ నాగరాజ నాయుడు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు 9701745437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

News February 12, 2026

ఈ నెల 16న ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక

image

TG: 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 16న కలెక్టర్ల పర్యవేక్షణలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. రేపు కౌంటింగ్ జరగనుండగా గెలిచిన అభ్యర్థులు 16న ఉ.11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. మ.12.30 గంటలకు మెజార్టీ ఆధారంగా ఛైర్‌పర్సన్/మేయర్ ఎన్నిక, తర్వాత వైస్ ఛైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎంపికలో ఎక్స్‌అఫీషియో(MPలు, ఎమ్మెల్యేలు, MLCలు) సభ్యుల ఓట్లూ కీలకం కానున్నాయి.

News February 12, 2026

ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

image

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.