News January 27, 2025

ఏలూరు: గ్రేట్ టీచర్లు..!

image

ఏలూరు జిల్లాలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ఈక్రమంలో నిర్వహించిన పరేడ్‌లో విద్యాశాఖ శకటం మొదటి స్థానంలో నిలిచింది. దీనిని కామవరపుకోట మండలం తూర్పుఎడవల్లి పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్స్(PTI) డి.రాజారావు, కళ్లచెరువు టీచర్ వై.బాలరాజు రూపొందించారు. ప్రథమ స్థానంలో నిలిచేలా శకటాన్ని తయారు చేసిన టీచర్లను ఎంఈవోలు, ప్రజాప్రతినిధులు అభినందించారు.

Similar News

News February 19, 2025

విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్‌కు స్పెషల్ రైళ్లు 

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం రోడ్(CHE), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. ఈ మేరకు నం.07025 CHZ-CHE రైలును ఫిబ్రవరి 21న, నం.07026 CHE-CHZ రైలును ఫిబ్రవరి 22న నడుపుతున్నామంది. ఈ రైళ్లు ఏపీలోని విజయవాడతో పాటు విజయనగరం, దువ్వాడ, రాజమండ్రి తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతుందని తాజాగా ఓ ప్రకటనలో SCR పేర్కొంది. 

News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

News February 19, 2025

వనపర్తి: ఇద్దరు కుమారులతో పాటు తల్లి అదృశ్యం

image

ఇద్దరు కుమారులతో పాటు తల్లి అదృశ్యమైన ఘటన పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పానుగంటి అలివేల తమ కుమార్తె, మనవాళ్లు చందు, మణిలు ఈనెల 13వ తేదీ నుంచి కనబడటం లేదని పెద్దమందడి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ తెలిసిన వారు పెద్దమందడి పోలీసులకు సమాచారమందిచాలని కోరారు.

error: Content is protected !!