News March 7, 2025
ఏలూరు: చాలా ఘోరం కదా..?

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలువురి కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ మధ్యలోనే కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ) చనిపోయాడు.
Similar News
News December 11, 2025
గద్వాలలో 86.77శాతం పోలింగ్ నమోదు

గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 86.77 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ తెలిపారు. నాలుగు మండలాల్లోని 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో ఉదయం 7:00 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా ప్రతి రెండు గంటలకు ఓసారి పోలింగ్ శాతాన్ని పరిశీలించినట్లు చెప్పారు.
News December 11, 2025
పల్నాడు DEOగా రామారావు బాధ్యతలు

పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO)గా పి.వి.జె. రామారావు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల లోటు, మౌలిక వసతులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ DEOకు సూచించారు.
News December 11, 2025
ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్‌గా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.


