News August 23, 2025
ఏలూరు: చెరువులో మునిగి ఒకరు మృతి

చెరువులో గేదెలను కడిగేందుకు దిగిన వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన పెదవేగి(M) కొప్పాకలో శనివారం చోటుచేసుకుంది. మృతుడు సాయిబాబా (52) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం గేదలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం కొప్పాక చెరువులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Similar News
News January 17, 2026
లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త: సీపీ సజ్జనార్

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
News January 17, 2026
మేడ్చల్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారం..!

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ రంగమే ప్రధాన జీవనాధారంగా సుమారు 40,872 మంది రైతులు, 19,000 మంది వ్యవసాయ కూలీలు జీవనం కొనసాగిస్తున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని.. రైతులు, కూలీలపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
News January 17, 2026
UPDATE: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి

పాఠశాల విధులకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీచర్ల ప్రాణాలను బలిగొంది. నలుగురు ఉపాధ్యాయులు కలిసి కారులో తుంగతుర్తికి బయలుదేరారు. మార్గమధ్యంలో కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న ఇసుక కుప్పపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తుంగతుర్తి KGBV ఎస్‌వో కల్పన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన రావులపల్లి HM గీతా రెడ్డిని HYDకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.


