News September 4, 2024
ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
పశ్చిమ మధ్య బంగాళఖాతంలో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రతీరం వెంబడి 35-45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
Similar News
News September 16, 2024
నరసాపురం: ఎరుపెక్కిన గోదావరి
నరసాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్డులో ఉన్న గోదావరి ప్రాంతమంతా సోమవారం ఎరుపు రంగులో కనిపించిది. సాయంత్రం 5 గంటలకు సంధ్యా సమయంలో ఒక్కసారిగా మేఘాలు ఎరుపు రంగులో కమ్ముకున్నాయి. దీంతో గోదారి రంగు మారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పలువురు ఈ చిత్రాన్ని తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
News September 16, 2024
ప.గో: రూ.20కే 11కేజీల లడ్డూ..!
మీరు చదివింది నిజమే. రూ.20కే 11 కేజీల గణేశ్ లడ్డూ ఇవ్వనున్నారు. ప.గో జిల్లా పోడూరు మండలం మట్టపర్రులో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా 11 కేజీల లడ్డూను రూ.20కే అందించడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం లడ్డూకు సంబంధించిన లక్కీ డ్రాను తీయనున్నారు. మరి ఆ లడ్డూ ఎవరికి దక్కుతుందనేది మరికాసేపట్లో తెలియనుంది. మరి మీ ఏరియాలోనూ ఇలాంటి లక్కీ డ్రా నిర్వహించి ఉంటే కామెంట్ చేయండి.
News September 16, 2024
పోలవరం: 8.14 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
గోదావరికి వరద ఉద్ధృతి నెమ్మదిగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఆదివారం సాయంత్రానికి 31.57 మీటర్లకు నీటి మట్టం చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ప్రాజెక్ట్ 48 గేట్ల ద్వారా 8.14 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేసినట్లు చెప్పారు. అదేవిధంగా గోదావరికి వరద తగ్గడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.