News April 25, 2024
ఏలూరు జిల్లాలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో చూసేయండి

ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆరో రోజు 1 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 40 నామినేషన్లు దాఖలయ్యాయి. 18 తేదిన మొదలైన నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ఏలురు పార్లమెంటు స్థానానికి 5 నామినేషన్లు దాఖలుకాగా.. మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 35 నామినేషన్లు దాఖలయ్యాయిని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చివరి రోజు గురువారం భారీగా నామినేషన్లు వచ్చే అవకాశలు ఉన్నాయన్నారు.
Similar News
News April 20, 2026
భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

భీమవరం చినమిరం ప్రాంతంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి అందిన సమాచారంతో సీఐ కాళీ చరణ్ నేతృత్వంలో దాడులు నిర్వహించి, నిందితుల నుంచి రూ.23,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
News April 20, 2026
10 గంటల నుంచి పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 ని.ల వరకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్ ఫ్రీ నంబర్, https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.