News March 24, 2024

ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

image

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్‌ను విధుల నుండి తొలగించామని తెలిపారు.

Similar News

News December 7, 2025

ప.గో డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

ఆదికవి నన్నయ యూనివర్సిటీ మూడు క్యాంపస్‌లో పీజీ కోర్సులకు ఈ నెల 8-12 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఎస్. ప్రసన్నశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలోని MA, M.com,Mped,Msc కోర్సులకు రాజమహేంద్రవరంలో ఉదయం10-4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్‌లు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

News December 6, 2025

భీమవరం: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి- కలెక్టర్

image

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో SHG మహిళలు అవగాహన కలిగి, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే స్థాపించిన యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్దీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

రేపు డయాలసిస్ కేంద్రాలకు భూమిపూజ: కేంద్రమంత్రి వర్మ

image

భీమవరం, ఆచంటలో రేపు డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న డయాలసిస్ రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నరసాపురం పార్లమెంట్ పరిధిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.10కోట్ల CSR నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.