News May 7, 2025

ఏలూరు జిల్లా: ప్రేమజంట ఆత్మహత్య

image

నెల్లూరులో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. తూ.గో: కొవ్వూరుకు చెందిన జోసఫ్ రత్నకుమార్, ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణి 4రోజుల కిందట నెల్లూరులోని సింహపురి హోటల్లో గదిని తీసుకున్నారు. శుక్రవారం రూము నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టగా కుళ్లిన స్థితిలో మృత‌దేహాలు దర్శనమిచ్చాయి. 3రోజుల కిందటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Similar News

News February 11, 2026

రామాయంపేట: తొలి ఓటుతో బాధ్యత చాటిన స్మిత

image

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామాయంపేటలోని 4వ వార్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో యువతి స్మిత తన తొలి ఓటు హక్కును వినియోగించుకుంది. మొదటిసారి ఓటు వేయడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ఈ శక్తివంతమైన హక్కును ప్రతి యువతీ యువకులు బాధ్యతగా వినియోగించుకోవాలని కోరింది. యువ ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

News February 11, 2026

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 5 సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA, CS, ICSI మెంబర్ షిప్‌తో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.concorindia.co.in

News February 11, 2026

పితృ దోషంతో పెళ్లికి ఆటంకాలు ఎదురవుతాయా?

image

జాతకంలో పితృ దోషం ఉన్నప్పుడు సంతానంతో పాటు వివాహం కూడా ఆలస్యమవుతుంది. పూర్వీకుల ఆశీస్సులు లేకపోవడం వల్ల ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. దీనికి పరిష్కారంగా అమావాస్య రోజున పితృ తర్పణాలు వదలాలి. గయ, కాశీ వంటి క్షేత్రాలలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే దోషం తొలగుతుంది. నిరుపేదలకు అన్నదానం చేయాలి. గోసేవ అత్యంత శ్రేష్ఠం. తద్వారా పితృ దేవతలు శాంతించి, త్వరగా పెళ్లి సంబంధం కుదిరేలా అనుగ్రహిస్తారు.