News March 11, 2025
ఏలూరు: టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్‌న్యూస్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి వరప్రసాద్ గుడ్ న్యూస్ చెప్పారు. టెన్త్ పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో ఈనెల 17 నుంచి వచ్చే నెల 1 వరకు విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో అనుమతిస్తారన్నారు.
Similar News
News January 18, 2026
విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.
News January 18, 2026
రేపు మౌని అమావాస్య.. ఉదయమే ఇలా చేయండి

రేపు పవిత్రమైన ‘<<18871132>>మౌని అమావాస్య<<>>’. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. ఉదయం సూర్య నమస్కారం చేయాలి. అనంతరం శ్రీహరి, మహాలక్ష్మీ, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. రేపు మౌనవ్రతం చేయడం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది.
News January 18, 2026
గచ్చిబౌలిలో కనువిందు చేసిన డ్రోన్ ఫెస్టివల్

గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘డ్రోన్ ఫెస్టివల్ 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రదర్శనను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఈ డ్రోన్ షోలో రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, పాలపిట్ట వంటి తెలంగాణ చిహ్నాలను ప్రదర్శించారు. ఆకాశంలో డ్రోన్లు చేసిన విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు.


