News May 7, 2025
ఏలూరు: నెల రోజుల్లో పెళ్లి.. ప్రమాదంలో మృతి

ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి తంగెళ్లముడిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. సిర్రా సాయికుమార్ (27) బైక్ పై వేగంగా వచ్చి ప్రమాదవశాత్తు గోడను ఢీకొట్టడంతో మృతి చెందాడని తెలిపారు. మృతుడు పట్టణంలోని రాణినగర్ వాసిగా గుర్తించామన్నారు. మరో నెలలో సాయికి వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 13, 2026
శివుడి మెడలో పుర్రెల దండ ఎందుకంటే

వర గర్వంతో విర్రవీగుతున్న రాక్షసులను అదుపు చేయడానికి మహావిష్ణువు సూచనతో శివుడు ఈ భీకర రూపాన్ని ధరించాడు. వారిని చెడు మార్గం నుంచి మళ్లించి, వారి ఆత్మతేజస్సును తగ్గించడం ద్వారా దేవతలను రక్షించాడు. ఇది కేవలం బాహ్య రూపం మాత్రమే కాదు. ధర్మాన్ని నిలబెట్టడానికి హరిహరులు చేసిన సంయుక్త ప్రయత్నం. అలాగే, ఇది జీవితం శాశ్వతం కాదని, అంతిమంగా అంతా శూన్యమని తెలిపే వైరాగ్యానికి ప్రతీక.
News February 13, 2026
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, మైనింగ్ ఇంజినీరింగ్ అర్హత గలవారు FEB 16 నుంచి మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. Jr. ఓవర్‌మెన్‌కు పే స్కేల్ రూ.31K-రూ.లక్ష, మైనింగ్ సిర్దార్‌కు రూ.26K-రూ.1,10,000. సైట్: www.nlcindia.in
News February 13, 2026
HYD: యువతి హత్య.. ఇన్‌ఫార్మర్ అతడే!

మొయినాబాద్‌లో ఆస్తికోసం అన్న, చెల్లి(న్యాయవాది)ని కిరాతకంగా చంపిన కేసులో పోలీసులు కీలక విషయాలు సేకరించారు. ఈ కేసులో శేఖర్ అనే వ్యక్తి స్వప్న అన్న రాజుకు ఇన్‌ఫార్మర్‌గా ఉంటూ కేతిరెడ్డిపల్లి నుంచి సమాచారం ఇచ్చాడు. ఆ సమాచారంతో రాజు, సందీప్, వీరేశ్, శివలింగం ఆమెను కిరాతకంగా హతమార్చారు. ముందు పొంతనలేని సమాధానం చెప్పినా తర్వాత నిజం ఒప్పుకున్నారు. గురువారం ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.


