News August 11, 2025
ఏలూరు: ‘నేషనల్ డీ-వార్మింగ్ డే విజయవంతం చేయాలి’

ఏలూరులో ఈనెల 12న జరిగే నేషనల్ డి-వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య శాఖ అధికారి అమృతం సోమవారం అధికారులకు తెలిపారు.1-2సం.ల పిల్లలకు albendazole 1/2 టాబ్లెట్, 2-19 సం.ల పిల్లలకు ఒక మాత్ర ఇస్తామన్నారు. కొంకి, నులి, బద్దే, గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. మంగళవారం హాజరు కాని పిల్లలకు ఈనెల 20వ తేదీన మాత్రలు ఇస్తామని అమృతం పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
TU: “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” పై జాతీయ సదస్సు

తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో “అడ్వాన్సెస్ ఇన్ కెమికల్ బయాలజీ – నావెల్ థెరాప్టిక్స్” అనే అంశంపై ఈ నెల 23,24 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డా.చంద్రశేఖర్ తెలిపారు. సందర్భంగా జాతీయ సదస్సు బ్రోచర్లను ఉపకులపతి ఆచార్య యాదగిరి రావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరితో కలిసి ఆవిష్కరించారు. అధ్యాపకులు సత్యనారాయణ, శిరీష, ప్రసన్న శీల పాల్గొన్నారు.
News March 11, 2026
ఖమ్మం: దారుణం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

కూసుమంచి మండలంలోని ఒక గ్రామంలో ఐదేళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో, వారు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
News March 11, 2026
గుంటూరులో వ్యభిచార గృహంపై దాడి

కొత్తపేట PS పరిధిలో తలపకట్టి హోటల్ పక్కన ఓ అద్దె ఇంట్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మంగళవారం టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకోగా, వారి నుంచి సెల్ ఫోన్లు, 2 కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్న లక్ష్మి (అరండలపేట), రాపోలు శివను నిందితులుగా గుర్తించారు. తదుపరి విచారణ కోసం కేసును కొత్తపేట పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.


