News April 26, 2024

ఏలూరు: రెండు లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

image

ఏలూరు నగర శివారు చాటపర్రుకు చెందిన ఈదుపల్లి పవన్ పోతురాజు (28) లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటారు. ఇతను గురువారం లారీలో వెళుతుండగా కొమడవోలు వద్ద వేరే లారీని తప్పించే క్రమంలో ఆ వాహనం డోర్ తగిలి రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు పోతురాజును సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News April 15, 2026

ఫిర్యాదుల పరిష్కారంలో ప.గో జిల్లాకు మూడో స్థానం

image

పీజీఆర్‌ఎస్‌ ద్వారా అందిన అర్జీలను పరిష్కరించడంలో పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమర్థంగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించాలన్నారు.

భీమవరం: నేడే ఇంటర్మీడియట్ రిజల్ట్స్

image

ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠత నెలకొంది. ఈ ఏడాది 53 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరంలో 19,662 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,888 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల తరువాత స్టూడెంట్స్ ఒత్తిడికి గురికాకుండా పేరెంట్స్ టీచర్స్ ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.